తెలంగాణ గౌడ యువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ను ఆర్మూర్ పట్టణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఆర్మూర్ పట్టణ గౌడ యువజన సంఘం సభ్యులు, నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ కు శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ కులస్తులందరూ ఐక్యతతో ఉండాలని, సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కుల ఐక్యత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ యువజన సంఘం అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి ఎలుక జీవన్ గౌడ్, జాయింట్ సెక్రటరీ ముఖేష్ గౌడ్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.












