ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కడ్తాల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల ఫిర్యాదులను మర్యాదతో స్వీకరించి, సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.
కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీస్ స్టేషన్ ఆవరణను, రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా ప్రతి ఫిర్యాదును స్వీకరించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని, చట్ట ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందిని కోరారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కూడా ఆయన సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవించడం, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించడం పోలీస్ శాఖ బాధ్యత అని నొక్కి చెప్పారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో మహేశ్వరం డిసిపి కె నారాయణరెడ్డి, మహేశ్వరం ఏసిపి ఎస్ జానకి రెడ్డిలు కూడా పాల్గొన్నారు.







