శివుడిని దేవుడిగా కొలిచేవారు అధికంగా ఉన్న భారతదేశంలో, శివుడు లేడని ఒక చర్చలో చిన్న జీయర్ స్వామి అనడం హాస్యాస్పదమని ధూప దీప నైవేద్య అర్చక సంఘం ప్రతినిధి శీర్ల వంచ కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. చిన్న జీయర్ స్వామి కులాన్ని ప్రశ్నించిన ఆయన, ఆయన వ్యాఖ్యల వల్ల హిందుత్వం ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.
శివుడిని దేవుడిగా కొలిచేవారు అధికంగా ఉన్న భారతదేశంలో, శివుడు లేడని ఒక చర్చలో చిన్న జీయర్ స్వామి అనడం హాస్యాస్పదమని ధూప దీప నైవేద్య అర్చక సంఘం ప్రతినిధి శీర్ల వంచ కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. చిన్న జీయర్ స్వామి కులాన్ని ప్రశ్నించిన ఆయన, ఆయన వ్యాఖ్యల వల్ల హిందుత్వం ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.
చిన్న జీయర్ స్వామి ఒక పాపులర్ ఫిగర్ అయినప్పటికీ, ఆయన గ్రాఫ్ పడిపోయిందని కృష్ణమాచార్యులు అన్నారు. సృష్టికర్త అయిన శివుడిని ద్వేషించే వారికి, తానే దేవుడినని చెప్పుకునే వారికి ఉండాల్సిన జ్ఞానం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. శివ ద్వేషానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
గతంలో కొందరు ఏడుకొండల నుండి కొన్ని కొండలు తీసేస్తామని ప్రగల్భాలు పలికి, తునాతునకలై కనుమరుగయ్యారని కృష్ణమాచార్యులు గుర్తుచేశారు. హిందువులలో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న హిందుత్వాన్ని మీరు వెలుగునిస్తారా లేక చీడపురుగులవుతారా అని ఆయన ప్రశ్నించారు. స్మశానం ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటారని, లింగధారణ చేసుకున్న వారి శరీరం స్మశానంతో సమానమా అని ఆయన నిలదీశారు. తాము శివలింగ ధారణ చేసుకుంటామని, నిజంగా స్మశానానికి వెళ్లకుండా శరీరంతో కైలాసానికి వెళ్తారా అని సవాలు విసిరారు.
చిన్న జీయర్ స్వామికి ఉండే అహంకారం అంతా ఇంతా కాదని, ఆదిశంకరులు లేరని, ఆయన ఏమీ చేయలేరని అంటున్నారని కృష్ణమాచార్యులు అన్నారు. లక్షల కోట్లు పోగు చేసుకుంటే మహానుభావులు అయితారని అనుకుంటే, ఆయన లక్షల కోట్లు చేసుకునేంత మహానుభావుడు ఏమీ ఆశించకుండా వెళ్లిపోయారని అన్నారు. తాము వెయ్యి కోట్లు వెనకేసుకొని ధనమదంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం అనుకుంటే ఎక్కడైనా శివభక్తులందరూ చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కుల ఆధారంగా కాకుండా వృత్తి ఆధారంగా కులం చెప్పుకునేవారు, ఇప్పుడు మార్కెట్లో బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న వారంతా చండాలులేనని కృష్ణమాచార్యులు అన్నారు. ఈ 'చండాల' అనే పదాన్ని కూడా వారే సృష్టించారని, ఆ వర్గంలో పుట్టి వేషం మార్చుకుని బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. నిజానికి వారంతా చుట్టాలు, దాయాదులేనని, వశిష్ట, అరుంధతి సంతానమని, పరాశరుని గోత్రం చెప్పుకునేవారేనని తెలిపారు. దేవతలకు వేశ్య అయిన ఊర్వశి కుమారుడు వశిష్ఠుడు, మతంగ ముని పుత్రిక అరుంధతి అనే మాదిగ స్త్రీని వివాహం చేసుకున్నారని, ఆవిడ మహా పతివ్రతగా దేవతలనే శాసించినట్లు పురాణాల్లో మీరే రాశారని అన్నారు. మరి మాదిగ అమ్మాయికి, వేశ్య కొడుకుకి పుట్టిన మీరు ఎలా బ్రాహ్మణులయ్యారని ప్రశ్నించారు. మా జోలికి రాకపోతే మీ రహస్యాలు ఎప్పుడూ చెప్పేవారం కాదని, కానీ మమ్మల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. కంసాలి, వడ్ల వంటి వృత్తి పేర్లు వాడుతూ, విశ్వకర్మ వంశ బ్రాహ్మణులను అవమానిస్తున్నందుకు మీ జన్మ రహస్యం చెప్పవలసి వచ్చిందని తెలిపారు. మీ పూర్వీకులు పశుపక్ష్యాదులను, సరీసృపాలను కూడా విడిచిపెట్టలేదని, కుందేలు, జింక, కప్ప, చిలుక, నక్క, కుక్కలకు పుట్టిన వారంతా మీకు గోత్రపురుషులేనని అన్నారు. ఈ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే వజ్రసూచి ఉపనిషత్తు చదువుకోమని సూచించారు. పురుష సూక్తం ప్రకారం, అందులో వర్ణించిన చతుర్వర్ణాలలో మొదటి వర్ణమైన బ్రాహ్మణులం మేమేనని, దేవతలకు గురువైన బృహస్పతి, దేవతల పురోహితులు విశ్వరూప ఆచార్యులు, శుక్రాచార్యులు, కాశ్యప, భృగు, అంగీరస, అధర్వణులు పరమాత్మ విశ్వకర్మ సంతానమేనని, ఆయన సృష్టి అని తెలిపారు. ఈ దేవతలందరు విశ్వకర్మ ముఖాల నుంచి పుట్టినవారు కాబట్టి, తమ రక్తంలో దేవతల అనువంశికత (DNA) కలిగి ఉన్నామని, అందుకే తమను దేవబ్రాహ్మణులు అని కూడా అంటారని అన్నారు. ఈ విషయంలో సందేహాలుంటే డిబేటింగ్ ఏర్పాటు చేస్తే వచ్చి నిరూపిస్తానని సవాలు విసిరారు. ఆధునిక కాలంలో కూడా మీ కట్టుకథలు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా, ప్రజలకు సాక్ష్యం, ఆధారాలు కావాలని, మీ కల్పిత కపోల కట్టుకథలు నమ్మే రోజులు మారిపోయాయని అన్నారు.







