బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య 'మ్యాచ్ ఫిక్సింగ్' జరిగిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి చెప్పిన మాటలనే బండి సంజయ్ కూడా చెబుతున్నారని, ఆయన కేటీఆర్‌ను కాకుండా రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని కౌశిక్ రెడ్డి అన్నారు. బంగారం షాపులో దొంగతనం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని, అయినప్పటికీ బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించడం లేదని ఆయన నిలదీశారు.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్ వద్దకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నుంచి బండి సంజయ్‌కు డబ్బులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు.
కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని, దమ్ముంటే కేటీఆర్‌తో చర్చకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, బండి సంజయ్‌ను తాము కూడా విమర్శించగలమని ఆయన వ్యాఖ్యానించారు.











