తెలంగాణ ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రక్షణ సేవలో భాగంగా, యువత, మహిళలు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో దేవాలయాలను సందర్శించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కేసారం లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, తో పాటు పెద్దమ్మ తల్లి దేవాలయాలను సందర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి, చైతన్యంతో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూచించారు.
2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలకు వైద్య, విద్య ఉచితంగా అందిస్తామని ఆమె ప్రకటించారు. మహిళా సాధికారత, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, సామాజిక తెలంగాణ కోసం యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కవిత కోరారు.
ఈ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ జాగృతి వేదికగా శిక్షణ అందిస్తామని ఆమె పేర్కొన్నారు. యువతకు, మహిళలకు రాజకీయాలపై అవగాహన కల్పించి, వారిని క్రియాశీలకంగా మార్చేందుకు కృషి చేస్తామని కవిత తెలిపారు.







