నిజామాబాద్, 2026-07-19
నగరంలోని 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అసద్‌బాబా నగర్ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో ఆదివారం ఏసీపీ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ఒక కారు, ఐదు ఆటోరిక్షాలు, 35 మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అసద్‌బాబా నగర్ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో ఆదివారం ఏసీపీ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ఒక కారును, ఐదు ఆటోరిక్షాలను, 35 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఏసీపీ స్థానికులకు పలు సూచనలు చేశారు. మైనర్లతో వాహనాలు నడపించరాదని, ప్రతి అపార్ట్మెంట్, నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసాల బారిన పడిన వెంటనే లేదా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే 6వ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












