ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగ రోజున చెరువులో పడి మృతిచెందిన బోడమీది హర్షిత్ కుటుంబ సభ్యులను పీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ (చిన్నా) ఆదివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఏబీ శ్రీనివాస్ మాట్లాడుతూ, హర్షిత్ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొనె దామోదర్, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి, కోలా వెంకటేష్, కౌన్సిలర్లు సడక్ వినోద్, నర్మే నవీన్, బోడమీది సుమన్, విజయ్ అగర్వాల్, సృజన్, నాగేంద్ర పాల్గొన్నారు.
పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రవి, గోజూర్ శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.కే బబ్లు, 18వ వార్డు ఇన్చార్జ్ కార్యదర్శి పాషా, నారాయణ రెడ్డి, రాజు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి రాకేష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

