సంగారెడ్డి, ఆగస్టు 4
వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, అతిసార వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో డా.లలితాదేవి) డా.లలితా దేవి సూచించారు.
వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, అతిసార వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డా.లలితా దేవి సూచించారు.
మంగళవారం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫార్మసీ అధికారులు, నర్సింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జ్వరాలతో వచ్చే ప్రతి రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, సకాలంలో చికిత్స అందించాలని, ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా సామగ్రి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత, దోమల నివారణ, తాగునీటి శుద్ధి, వ్యక్తిగత పరిశుభ్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
డిజిటల్ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఫార్మసీ అధికారులు మందుల నిల్వలు, పంపిణీ, గడువు తేదీల పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నర్సింగ్ అధికారులు రోగులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్‌వో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డా.శశాంక్ దేశ్‌పాండే, జిల్లా ఫార్మసీ అధికారి ఏ.యూ.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.












