గుండె లయ తప్పిన వారికి 'పేస్‌మేకర్' ఒక వరం లాంటిదని యశోద ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎంఎస్ ఆదిత్య తెలిపారు. ఈ పరికరం గుండె వేగాన్ని పరిమితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి యశోద బ్రాంచ్ క్లినిక్‌లో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. హార్ట్ బ్లాక్, సిక్ సైనస్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడేవారికి పేస్‌మేకర్ అమర్చడం ద్వారా సాధారణ జీవితం గడిపే అవకాశం ఉందని డాక్టర్ ఆదిత్య వివరించారు.
గుండె చాలా నెమ్మదిగా కొట్టుకోవడం వంటి పరిస్థితుల్లో పేస్‌మేకర్ అమర్చడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరచవచ్చని ఆయన తెలిపారు.
ఈ పరికరం గుండె లయను క్రమబద్ధీకరించి, రోగులు మెరుగైన జీవనశైలిని గడపడానికి సహాయపడుతుందని డాక్టర్ ఆదిత్య పేర్కొన్నారు.











