కామారెడ్డి, 2026-07-01
కామారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) జిల్లా ఇంచార్జ్ అల్లూరి ముదిరాజ్ హెచ్చరించారు. తల్లిదండ్రులను ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని, తగ్గించకపోతే ఆందోళనలు చేపడతామని తెలిపారు.
కామారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) జిల్లా ఇంచార్జ్ అల్లూరి ముదిరాజ్ హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజుల విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, కొందరు యాజమాన్యాలు తల్లిదండ్రులను ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఇకనైనా ఫీజులు తగ్గించకపోతే టీజీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకున్నా కార్పొరేట్ తరహాలో ఫీజులు దండుకుంటున్నాయని, పిల్లలకు న్యాయం చేయాలని టీజీవీపీ డిమాండ్ చేసింది.
అలాగే, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా కేటాయించాలనే నిబంధనను ఇప్పటికీ అమలు చేయలేదని, ఈ కార్యక్రమానికి సంబంధించిన నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని టీజీవీపీ కోరింది.
కామారెడ్డిలో విద్యారంగ సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీజీవీపీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు విజయ్, భాస్కర్, ప్రశాంత్ గౌడ్, రమేష్, అఖిల్, సంఘ నాయకులు పాల్గొన్నారు.











