కామారెడ్డి, 10-07-2026
కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM)ను 10-07-2026న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొని యువతకు అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పించనున్నాయి.
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, బిచ్కుంద, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM)ను నిర్వహించనున్నారు. ఈ మేళా 10-07-2026న ఉదయం 10:00 గంటలకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, ఐటీఐ, బిచ్కుందలో జరగనుంది.
ఈ మేళాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖ పరిశ్రమలు, సంస్థలు పాల్గొని అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పించనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ (డిప్లొమా), డిగ్రీ, ఇతర సాంకేతిక అర్హతలు కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, విద్యార్హతల ఒరిజినల్, జిరాక్స్ ధృవపత్రాలు, తాజా పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బయోడేటా, ఇతర అవసరమైన పత్రాలతో హాజరుకావాలి. అప్రెంటిస్షిప్ ద్వారా పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణతో పాటు భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, బిచ్కుంద జిల్లా ప్రిన్సిపాల్ శ్రీ. జి. ప్రమోద్ కుమార్ కోరారు.
కార్యక్రమం: ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM) తేదీ: 10-07-2026. సమయం: 10:00 A.M. వేదిక: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, బిచ్కుంద, కామారెడ్డి జిల్లా - 503306 అర్హతలు: 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర సాంకేతిక అర్హతలు.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సినవి: జిల్లా కన్వీనర్ / ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటిఐ, బిచ్కుంద, కామారెడ్డి జిల్లా. Email Id:- govtitibichkunda@gmail.com, Contact No. 8500463363 / 9640228856.












