కామారెడ్డి, 10/07/2026
శ్రీ సరస్వతీ విద్యాపీఠం, ఇందూర్ విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డిలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్లో రెండు రోజుల ఆచార్య నిరంతర శిక్షణా శిబిరం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరంలో దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థి కేంద్రీకృత బోధన వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.
స్థానిక జిల్లా కేంద్రమైన శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్, కామారెడ్డిలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం, ఇందూర్ విభాగం స్థాయి ఆచార్య శిక్షణా శిబిరం రెండు రోజుల పాటు జరగనుంది. ఈ శిబిరంలో మొదటి రోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెడ్డిగారి హరిస్మరణ్ రెడ్డి (క్షేత్ర పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్) మాట్లాడుతూ, దేశ నిర్మాణం తరగతి గదిలోనే మొదలవుతుందని తెలిపారు. విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా విద్యా బోధన చేయాలని, మనం మొదటగా చదవాల్సింది విద్యార్థిని అని అన్నారు. విద్యాపీఠం నిర్దేశించిన కరికులంకు అనుగుణంగా విద్యార్థులకు బోధించాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఆచార్యులు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుని విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉండాలని తెలిపారు.
విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ పక్కి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఆచార్య నిరంతర శిక్షణా శిబిరంలో నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. సరస్వతీ విద్యా మందిరాలలో విద్యాపీఠం కరికులం భాగంగా పంచపదీయను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ శ్రీ శ్యాంసుందర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి శ్రీ గీరెడ్డి రాజిరెడ్డి, ఇందూర్ విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీ పక్కి శ్రీనివాస్, క్షేత్ర పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్ శ్రీ రెడ్డిగారి హరీష్మరణ్ రెడ్డి, పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ నల్ల నాగభూషణం, అకాడమిక్ ప్రిన్సిపాల్ శ్రీ నాగేష్, ఇందూరు విభాగ్ స్థాయిలోని వివిధ పాఠశాలల ఆచార్య బృందం పాల్గొన్నారు.











