సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 20వ తేదీన ఆద్య శిల స్థాపనోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.
శనివారం ఆశ్రమంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అష్టోత్తర శతావర్తన హనుమాన్ చాలీసా పారాయణ పురస్సర ఆద్య శిల స్థాపనోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, 108సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సాయంత్రం ఐదు గంటలకు భక్తులచే శిలలపై బీజాక్షరాలు రాయించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంత కిషన్, నీలం మధు, ప్రశాంత్ కుమార్, సెంథిల్ పాల్గొన్నారు.












