స్థానిక హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీరామచంద్ర పట్టాభిషేకము, కళ్యాణ మహోత్సవము భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ, ప్రజలు శాంతిభద్రతలను కాపాడుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని ఆయన తెలిపారు. ముఖ్య దేవాలయాలు, ర్యాలీలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







