కామారెడ్డి జిల్లాలోని గర్గుల్ గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
గర్గుల్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థాపిత దేవతలకు నూతన వస్త్రాధారణ చేసి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
కళ్యాణ మహోత్సవంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, మంగళహారతులు, ఓడి బియ్యం, చీర సారెలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం సీతారాముల స్వామి వారిని భజనలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు.
ఈ మహోత్సవానికి గ్రామ సర్పంచ్ చింతల దివ్య రవితేజ, గ్రామ పంచాయతీ పాలక వర్గం, రామాలయ కమిటీ సభ్యులు, అంజన్న స్వాములు, పలువురు భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












