సదాశివపేట, 2026-08-02
సదాశివపేట పట్టణంలోని చాపలకేరిలో శ్రీ మహంకాళి మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక బోనాల ఊరేగింపు ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పోతురాజుల విన్యాసాలు, జోగిని బోనం, యువకుల నృత్యాలతో ఈ వేడుకలు కనుల పండువగా సాగాయి. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా సదాశివపేట మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపిప్రియాంక పవన్, 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమతతో కలిసి పులిమామిడి రాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పులిమామిడి రాజు దంపతులు అమ్మవారికి బంగారు కళ్లతో పాటు బంగారు నుదుటి తిలకాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పించడం ఈ ఉత్సవంలో విశేషంగా నిలిచింది. భక్తి పారవశ్యంతో సమర్పించిన ఈ కానుకలు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి.
ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, కౌన్సిలర్లు పులిమామిడి మమత, వైద్యం గోపి ప్రియాంక పవన్, శంకర్ గౌడ్, నర్సింలు పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లూరి నాగరాజు గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, కోవూరి విజయ్, షాజ్జి భాయ్, బిట్ల ప్రేమ్, లడ్డు వెంకన్నబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ మహంకాళి మందిరం అధ్యక్షుడు నల్ల సుధాకర్, కార్యదర్శి శంకర్, కమిటీ సభ్యులు చాపల హన్మంతు, బంటు రవి, అఖిల్, క్రిష్ణ, ప్రవీణ్, నరేందర్, మనోహర్, ఆనంద్ ఆధ్వర్యంలో ఈ బోనాల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించారు.