సంగారెడ్డి, జూలై 26
సదాశివపేటలోని చాపలకేరి శ్రీ మహంకాళి మందిరంలో జూలై 31 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న 30వ బ్రహ్మోత్సవాలు, బోనాల జాతరకు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని చాపలకేరి శ్రీ మహంకాళి మందిరంలో ఈ నెల 31 నుంచి ఆగస్టు 3వ తేది వరకు నిర్వహించనున్న 30వ బ్రహ్మోత్సవాలు మరియు బోనాల జాతరకు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా జూలై 31 శుక్రవారం ఉదయం 10గంటలకు కలశాల ఊరేగింపు, ప్రత్యేక అభిషేకాలు, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 1 శనివారం రాత్రి 9గంటలకు తెలంగాణ సాంప్రదాయ భజన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆగస్టు 2 ఆదివారం శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ (జాతర)ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆగస్టు 3 సోమవారం అమ్మవారి బ్రహ్మోత్సవాలు, గిరి ప్రదక్షిణ, కంకణ విసర్జన, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ నాలుగు రోజులపాటు జరిగే ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రీ మహంకాళి మందిరం ఆలయ కమిటీ మరియు భక్త బృందం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నల్ల శంకర్, చాపల హన్మంతు, బంటు రవి, కప్పల రాము మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, గుణాకర్, తాలెల్మ రాము, ఆనంద్ (చిన్న), తాలెల్మ రాము, సోమ శంకర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.












