పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే నిజామాబాద్ జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో మార్చి 5న వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం ప్రారంభమై నెల రోజులు మాత్రమే అయింది.
శనివారం ఉదయం భర్త శ్రీకాంత్ ఇంట్లోంచి బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అఖిల, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.











