మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ జంట మృతదేహాలు ఎస్సారెస్పీ కాలువలో లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్రకు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కలిసి బైక్పై వెళ్తుండగా, యువతికి బైక్ నేర్పిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయారని ప్రాథమికంగా భావిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలో గల్లంతైన యువతీ యువకుల మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.










