అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి కర్ణాటక హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. సుమారు రూ.7.5 కోట్ల విలువైన కుంభకోణం కేసులో ఆమెపై ప్రాసిక్యూషన్ విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
2021లో మైసూర్ జిల్లాలో 'ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల' కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మార్కెట్ ధర రూ.13 ఉన్న బ్యాగులను రూ.52 చొప్పున కొనుగోలు చేశారని, దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.7.5 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, కేసు విచారణకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. 'శాఖాపరమైన విచారణలో క్లీన్ చిట్ వచ్చినా, క్రిమినల్ విచారణ ఆగదు. అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం' అని న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కేసు విచారణకు మరింత బలాన్ని చేకూర్చాయి.
Prevention of Corruption Act, సెక్షన్ 17A కింద విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వానికి ఈ విషయంలో కోర్టు గట్టిగా మందలించింది. దీంతో అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది. రోహిణి సింధూరి ఈ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.











