రెంజల్ మండలం కందకుర్తిలో పర్యటించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, హిందువులంతా మరింత ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేశవ్ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
హిందువులను సంఘటితం చేయడమే స్వయం సేవక్ సంఘ్ స్థాపన లక్ష్యమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కందకుర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హిందువులంతా మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కందకుర్తి ప్రాంతం దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
రెంజల్ మండలం కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటనలో భాగంగా, నూతనంగా నిర్మించిన కేశవ్ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ సమావేశమైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
స్ఫూర్తి కేంద్రాన్ని ప్రతి ఒక్క హిందువు సందర్శించాలని, దాని ద్వారా చరిత్రను తెలుసుకోవాలని భగవత్ విజ్ఞప్తి చేశారు. చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ నుంచి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టాలనే కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఆకాంక్ష నెరవేరిందని మోహన్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కార్యకర్తలతో సమావేశమై, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.











