కామారెడ్డి, జూలై 15
కామారెడ్డి జిల్లా భిక్కనూరులో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి వర్గాలకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భిక్కనూరు మండల రెడ్డి సంఘం వైస్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి అధ్యక్షత వహించగా, రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల వైస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరగొండ ఏనుగు సంతోష్ రెడ్డి రెడ్డిల రాష్ట్ర సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని, ఆయన స్ఫూర్తితో రెడ్డి సంఘాల గ్రామీణ ప్రాంతాల నుండి మండలం, జిల్లాలు, తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాలను ఐక్యమత్యంతో బలోపేతం చేస్తూ రెడ్డి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో రెడ్డి సంఘాలు ఐక్యంగా ఉండి మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. భిక్కనూరు మండల రెడ్డి సంఘం నుంచి కామారెడ్డి జిల్లా కమిటీలో సంఘ అభివృద్ధికి ఉత్సాహంగా ఉన్న నలుగురిని సెలెక్ట్ చేసి పంపాలని ఆయన సూచించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన పేద రెడ్డి వర్గాలకు (EWS) అన్ని రంగాల్లో ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో రెడ్డి విద్యార్థులకు కూడా తగిన విద్యా అవకాశాలు కల్పించాలని కోరారు.
అనంతరం కామారెడ్డి జిల్లా రెడ్డి సంఘాల అధ్యక్షుడు జుక్కంటి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి కార్పొరేషన్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేసి, కార్పొరేషన్‌కు తగిన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి రాజకుమార్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు పాలకవర్గాన్ని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నాగార్తి చంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోతే రాంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాజకుమార్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ జుక్కంటి మోహన్ రెడ్డి, జిల్లా వర్కింగ్ కన్వీనర్ బాణాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి అంజిరెడ్డి, ఏనుగు మోహన్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కందడి ప్రవీణ్ రెడ్డి, భిక్కనూరు మండల వైస్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కందడి రమేష్ రెడ్డి, మద్ది కృష్ణారెడ్డి, ఏనుగు మోహన్ రెడ్డి, రెడ్డి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











