అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) పురస్కరించుకుని కూకట్‌పల్లిలోని మోతీనగర్‌లో శ్రమజీవుల సేవలను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించి, చీరలు, పండ్లు పంపిణీ చేశారు.
శ్రమజీవుల దినోత్సవమైన మే డే సందర్భంగా, మోతీనగర్‌లోని ఎస్బీఐ బిల్డింగ్ ఎదురుగా ఉన్న "ఈ- సేవ" కార్యాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, జిహెచ్ఎంసి కార్మికుల సేవలను ప్రశంసించారు.
కార్మికుల సేవలను గుర్తించినట్లుగా, వారికి చీరలు, పండ్లు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులుగా డ్రైవ్ వ్యవస్థాపక ప్రధాన కార్య నిర్వాహకులు పర్చూరు వెంకటరావు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వెంకట దాసు కూడా పాల్గొని అరటి పండ్లను పంపిణీ చేశారు. జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికారు.
ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ, "కార్మికుల శ్రమ దేశాభివృద్ధికి మూలస్తంభం. వారి కష్టానికి తగిన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం. మే డే అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, కార్మికుల హక్కులు, గౌరవం, సమానత్వం కోసం జరిగే పోరాటానికి ప్రతీక. జనసేన ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారిలో కలిగినీడి ప్రసాద్, పోలెబోయిన శ్రీనివాస్, సుబ్బారావు, పడాల ప్రసాద్, శేషు కుమారి, సాయి ప్రియ, సాయి వాసవి, మండల కాళేశ్వరరావు, ఎనుముల రాంబాబు, చలమశెట్టి విశ్వేశ్వరరావు, పి.సైదులు, పి.కృష్ణ చౌదరి, కే.సుదర్శన్ రెడ్డి, రావుల సీనయ్య చారి, కే.రమణ చారి, పి.మోహన్ ముదిరాజ్, కే.మల్లేష్ గౌడ్ ఉన్నారు.











