ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా మహిళా విభాగం మరియు వనితా క్లబ్ గ్రేటర్ జనగామ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఉగాది వేడుకలను స్థానిక గాయత్రి గార్డెన్లో ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రముఖులను సన్మానించారు.
జనగామలో మార్చి 8వ తేదీన ఉదయం 11 గంటలకు గాయత్రి గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగుం బిక్షపతి, రిజైన్ చైర్మన్లు పడకండి రవీందర్, సారబు ఆంజనేయులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ముఖ్య అతిథి డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలను కొనియాడారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ మదoశెట్టి వరూధిని, వనితా క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యక్షురాలు గంగిశెట్టి అనూజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న మహిళలందరినీ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 80 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధంశెట్టి వరూధిని, వనితా క్లబ్ అధ్యక్షురాలు గంగిశెట్టి అనూజ, కార్యదర్శులు తమ్మి స్రవంతి, కాపర్తి మాధవి, కౌకోటి రామారావు, రాజ్యలక్ష్మి, తాటిపెళ్లి లావణ్య, గన్ను స్నేహలతతో పాటు వివిధ మండలాల నుండి వచ్చిన నాయకులు, సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

