సంగారెడ్డి, జులై 29
పటాన్ చెరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయాల కోసం నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డును అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ మార్కెట్ యార్డ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయాల కోసం నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డును రాబోయే రోజుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ మార్కెట్ యార్డ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
మార్కెట్ యార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం అవడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో త్వరలో దుకాణ సముదాయాలను ప్రారంభిస్తామని ఛైర్మన్ ఏపూరి శివానందం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజశేఖర్, డీఈ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు హమీద్, సందీప్, ఏఎంసీ సెక్రటరీ సునీల్ కుమార్, కాంట్రాక్టర్ కాశీరెడ్డి, రైతులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












