పటాన్చెరు, జూలై 27
ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరు మండలం లక్షారం రైతు వేదికలో రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు ఆలస్యమైనా రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల నిర్వహణ చేపట్టాలని సూచించారు.
ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరు మండలం లక్షారం రైతు వేదికలో రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు ఆలస్యమైనా రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల నిర్వహణ చేపట్టాలని సూచించారు. నేలలో తేమను కాపాడే పద్ధతులు, తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవడం, సూక్ష్మ సేద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు.
వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల సంరక్షణ చర్యలు చేపట్టాలని, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నివారణ, పురుగు నివారణ చర్యలను శాస్త్రీయంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు, సాంకేతిక సలహాలను సద్వినియోగం చేసుకుంటే నష్టాలను తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చన్నారు.
రైతులు వ్యవసాయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పంటల నిర్వహణ చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీఏ మనోహర, శాస్త్రవేత్త అరుణ, ఆత్మ కమిటీ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ, ఏవో శివకుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఏఈవోలు మౌనిక, వినోద్, బీటీఎం స్పందన, ఏటిఎం సాయి, రోజా, రైతులు రాజిరెడ్డి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












