మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని నాగారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువులను అందజేశారు.
నాగారం డివిజన్ మసీదులో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం పేదలకు కానుకలను అందజేయడం జరిగింది. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగింది.
మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఈ తోఫాలను అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ముస్లింలు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

