పటాన్చెరు, జూలై 6
భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరు, నందిగామలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన మార్కెట్ కమిటీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్టమైన ముద్ర వేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కమిటీ అన్నారు.
భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం పటాన్ చెరు, నందిగామలో ఆయన విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్టమైన ముద్ర వేసిన గొప్ప నాయకుడని, సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, ఉప సర్పంచ్ గోరేమియా, వార్డు సభ్యులు, ఎస్ ఆర్ పీ ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రారం శంకర్, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు బాల్ రాజ్, రఘు, బల్వంత్, జంగయ్య, గోపాల్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.












