సదాశివపేట, జూలై 22
సదాశివపేట పట్టణంలో ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నొస్టిక్ సెంటర్ను సీనియర్ నాయకుడు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గురునగర్ కాలనీ, గణేష్ కట్ట సమీపంలో ఈ సెంటర్ ను ప్రారంభించారు.
సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీ, గణేష్ కట్ట సమీపంలో ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నొస్టిక్ సెంటర్ ను సీనియర్ నాయకుడు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఆధునిక వైద్య పరీక్షలు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి డయాగ్నొస్టిక్ సెంటర్లు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా చేయడంతో పాటు మెరుగైన ఆరోగ్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా సదాశివపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సెంటర్ ప్రోప్రైటర్లు మహమ్మద్ యూనుస్, మహమ్మద్ యూసుఫ్, వీరేష్, సంగమేష్, నూతన్, ఫెరోజ్, రజినీకాంత్, సాయి, పి.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, గుణాకర్, తాలెల్మ రాము, సోమ శంకర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.












