నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ఐదుగురు యువకుల్లో నలుగురు నీటిలో స్నానానికి దిగి లోతైన గుంతల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు వచ్చిన ఐదుగురు యువకుల్లో నలుగురు ప్రమాదవశాత్తు లోతైన గుంతల్లో మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం ఉదయం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి విహారానికి వచ్చారు. అనంతరం వారు నీటిలో స్నానానికి దిగగా, లోతైన గుంతల్లో చిక్కుకుని నలుగురు మునిగిపోయారు. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
సమాచారం అందుకున్న వెంటనే సీఐ జాన్‌రెడ్డి, ముప్కాల్ ఎస్ఐ కిరణ్‌కుమార్, మెండోరా తహసీల్దార్ సుహాసిని సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












