నిజామాబాద్, జూలై 14
హమల్వాడిలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కుటుంబ సభ్యులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ప్రమాదం పెద్దది కాకుండా అరికట్టగలిగారు.
హమల్వాడిలో మంగళవారం ఉదయం సుమారు 9:30 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో మంటలు మరింత వ్యాపించకుండా అరికట్టగలిగారు.
అయితే ఈ ప్రమాదంలో ఇంట్లోని కబోర్డులో భద్రపరిచిన ముఖ్యమైన పత్రాలు, ఫ్రీజర్, ఎయిర్ కండీషనర్ (ఏసీ), దుస్తులు పూర్తిగా దగ్ధమైనట్లు ఇంటి యజమాని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












