### (ప్రశ్న ఆయుధం) జూలై 06
కామారెడ్డి జిల్లా గన్నారం ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణ్‌రావు (50) తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి బైక్‌పై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లాలో గన్నారం ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణ్‌రావు (50) తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబీర్ లక్ష్మణ్‌రావు నిజామాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి కామారెడ్డి వైపు బైక్‌పై వస్తుండగా, గన్నారం ప్లాంట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో పాటు రెండు కాళ్లు విరిగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడి వద్ద ఉన్న పర్సును పరిశీలించగా, సుమారు 3 తులాల బంగారు పుస్తెల గొలుసు, రూ.2,550 నగదు, ఒక సెల్‌ఫోన్ లభించాయి. వీటిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి పోలీస్ ఔట్‌పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్‌రావు బాధితుడి కుమారుడు గోపిరావుకు అప్పగించారు.
ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.











