పటాన్చెరు, జూన్ 29
పటాన్ చెరులోని కృష్ణారెడ్డిపేట్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం బీరంగూడ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలోని భార్గవి అపార్ట్మెంట్లో జరిగింది.
బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట్ గ్రామం దుర్గానగర్ కాలనీలోని భార్గవి అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంట్లోని విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు.












