మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై నిజామాబాద్ పోలీసులు కఠిన వైఖరి అవలంబించారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన 13 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మార్గదర్శకాలతో, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ నేతృత్వంలో జరిగిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 13 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరుపరిచారు.
కోర్టు విచారణ అనంతరం, 10 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులుగా తేలడంతో వారికి మొత్తం ₹1,15,000 జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని ఆదేశించారు.
మరోవైపు, మద్యం సేవించి వాహనాలు నడపడంలో తీవ్రంగా వ్యవహరించిన ముగ్గురికి న్యాయస్థానం వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. వీరిలో పంకజ్ కుమార్, ఎడ్ల రవి, అక్రమ్ సిద్ధిక్ ఉన్నారు.
ఈ సందర్భంగా, ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ఇది తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుందని తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.








