సంగారెడ్డి, జూలై 10
సంగారెడ్డి జిల్లా పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో వోక్సెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ ఆఫీస్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం తొలి బ్యాచ్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
జిల్లా పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు వోక్సెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ ఆఫీస్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం తొలి బ్యాచ్ ముగింపు సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి ఆయన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో ఆధునిక సాఫ్ట్వేర్లపై సిబ్బంది పట్టు సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. ఎంఎస్ ఆఫీస్, ముఖ్యంగా వర్డ్, ఎక్సెల్ వంటి సాఫ్ట్వేర్లలో ప్రావీణ్యం పెరగడం ద్వారా కార్యాలయ పనితీరులో వేగం, ఖచ్చితత్వం, సమర్థత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, సైబర్ వారియర్స్, టెక్ టీమ్ సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు మొత్తం 180 మంది సిబ్బందిని 3 బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు 3 రోజుల చొప్పున శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ సిబ్బందిని ఆయన అభినందించారు.
వోక్సెన్ యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లకు పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వోక్సెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, జిల్లా పోలీసు అధికారులు, శిక్షణ పొందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












