జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలంలోని పోషనిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు.
కొనుగోలు కేంద్రంలో అమలవుతున్న విధానాన్ని సమీక్షించిన కలెక్టర్, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి వరి సంచికి 40.600 కిలోల తూకం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని, తూకం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సన్న ధాన్యం నాణ్యతను యంత్రాల ద్వారా పరీక్షించి, తేమ శాతం వివరాలను పరిశీలించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.











