సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించారు.
చింత ప్రభాకర్ సదాశివాపేట పట్టణంలోని 11వ వార్డు భాష్యం స్కూల్లో పోలింగ్ స్టేషన్కు చేరుకుని ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించిన అనంతరం, ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని తెలిపారు.
ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి కోరే నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.


