బూర్గంపాడు మండల సర్పంచుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు శుక్రవారం సారపాకలో జరిగాయి. ఈ ఎన్నికల్లో బూర్గంపాడు గ్రామ సర్పంచ్ మందా నాగరాజును సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సారపాకలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని సర్పంచులు పాల్గొని, తమ సంఘానికి కొత్త కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మందా నాగరాజు 2026 మే 8వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
ఉపాధ్యక్షులుగా తాటి వాణి, బానోతు పద్మ, గుమ్మడి కృష్ణవేణి, శర్ప నాగమణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పూనం సురేందర్, కోశాధికారిగా కుంజా కొండమ్మ ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షుడు మందా నాగరాజు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, సర్పంచుల సమస్యల పరిష్కారానికి సంఘం వేదికగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.










