తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. చేయూత పథకం కింద మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.233 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే పెన్షన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చేపట్టనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం రాష్ట్రంలోని నిరుపేదలకు, వృద్ధులకు ఆర్థికంగా కొంత చేయూతనిస్తుందని భావిస్తున్నారు. పెన్షన్ల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.











