జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు.
అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని, జీవితాలను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లాలో నమోదైన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ పడేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుళ్ల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.










