జాతీయ అగ్ని మాపక సేవా వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిశ్రమలు, పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణలు, డ్రిల్స్ చేపట్టారు.
జంగంపల్లిలోని బేసిస్ ల్యాబొరేటరీస్‌లో పరిశ్రమల అగ్ని భద్రతపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లా అగ్ని మాపక అధికారి ఆర్. సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రసాయనాల సురక్షిత వినియోగం, విద్యుత్ భద్రత, అగ్నిమాపక పరికరాల నిర్వహణపై అధికారులు వివరించారు.
కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఎవాక్యుయేషన్ విధానం, ప్రాథమిక అగ్నిమాపక పద్ధతులపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ డ్రిల్ నిర్వహించి, అప్రమత్తతను పెంచారు.
అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగులకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, యార్డ్ హైడ్రెంట్ వ్యవస్థ, ప్రాథమిక అగ్నిమాపక పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు. హాజ్కెమ్ కోడ్ ప్రాముఖ్యత, వేగవంతమైన స్పందన అవసరాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమాలను బేసిస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం, సిబ్బంది అభినందించారు. అగ్ని భద్రతపై అన్ని వర్గాల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి కొనసాగుతుందని అగ్నిమాపక శాఖ తెలిపింది.












