దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు మరియు మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య ప్రతిరోజూ నడిచే కొత్త ప్యాసింజర్ రైలును ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
57407/57408 నంబర్లతో నడిచే ఈ రైలు గుంతకల్లు, మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతూ మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది.
గుంతకల్లు నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరే రైలు రాత్రి 11:30 గంటలకు మార్కాపురం చేరుకుంటుంది. ఈ సర్వీసుతో ప్రయాణికుల ప్రయాణ సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.
తిరుగు ప్రయాణంలో, మార్కాపురం రోడ్డు నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 10:30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. ఈ కొత్త రైలు సర్వీసుతో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.







