తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్ సి హెచ్ పి ఎస్ ) జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం కలిసి, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
బంజారా హిల్స్ లోని మంత్రి క్వార్టర్స్ లో జరిగిన ఈ భేటీలో, ఏజెన్సీ ప్రాంత ఎస్సీల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు సమయం కేటాయించాలని నాయకులు మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వర్గం ప్రజలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయారని, అనాధలుగా జీవిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాయకుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఈనెల 20వ తేదీ తర్వాత తగిన తేదీని ఖరారు చేసి సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.











