సంగారెడ్డి, ఆగస్టు 4
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేటాయించిన స్థలంలో టీజీవో జిల్లా శాఖ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రహరీ గోడ, భవనం నిర్మించి ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) జిల్లా శాఖ నాయకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి విన్నవించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కూడా కోరారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేటాయించిన స్థలంలో టీజీవో జిల్లా శాఖ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రహరీ గోడ, భవనం నిర్మించి ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) జిల్లా శాఖ నాయకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా, టీజీవోఎస్ జిల్లా శాఖ ప్రారంభం నుండి ఒక ప్రైవేట్ భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీనివల్ల కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు వంటివి నిర్వహించడంలో సభ్యులకు అసౌకర్యం కలుగుతోందని వారు జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సంఘం వివిధ స్థాయిలలోని గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడుల దృష్ట్యా, ప్రభుత్వ ఉద్యోగుల కొరకై కలెక్టరేట్ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపై జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో టీజీవోఎస్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వైద్యనాథ్, డాక్టర్ సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు శారద, సంయుక్త కార్యదర్శి రవికుమార్, కార్యనిర్వహక కార్యదర్శి వినయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.












