తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్లు జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం వినాయక్‌నగర్‌లోని అమరవీరుల పార్కుకు చేరుకున్న నాయకులు తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు.
వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో అమరవీరులు చేసిన త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడం అందరి బాధ్యత అని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












