కామారెడ్డి, 02.07.2026
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.00 టీఎంసీల నీటి నిల్వ ఉందని, రైతుల అవసరాలకు తగినట్లు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
మధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ డ్యాంలోని ప్రస్తుత నీటి నిల్వల పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అందించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 6.00 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుత వర్షాకాల వ్యవసాయ సీజన్లో నారుమడులు, పంటల సాగుకు అవసరమైన మేర నీటిని విడుదల చేసేలా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.












