కామారెడ్డి నియోజకవర్గంలోని ఇస్రోజివాడి గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వంట సామాగ్రిని పంపిణీ చేశారు.
టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు ఇంటికి అవసరమైన వంట సామాగ్రిని అందజేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజా పాలన ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సొంత స్థలం లేని వారికి గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గృహ సదుపాయాల మెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, నిమ్మ విజయకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మున్సపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు సలీం, పిడుగు సాయిబాబా, చింతల రవీందర్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











