తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌పై చర్చకు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యులందరినీ ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, పలుమార్లు హెచ్చరించినా బీఆర్ఎస్ సభ్యులు తీరు మార్చుకోలేదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, సభ సజావుగా సాగేందుకు వీలుగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఈ సెషన్ కాలానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ కంపెనీ మంత్రి పొంగులేటికి చెందినదని, దీనిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపైనే అసెంబ్లీలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.











