జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఈ నెల 28వ తేదీన (శనివారం) తెలంగాణ వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్ లో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.భవాని చంద్ర ప్రజలకు, కక్షిదారులకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్ర మాట్లాడుతూ, జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని, సత్వర న్యాయం లభిస్తుందని తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్ లతో పాటు జిల్లాలోని ఇతర కోర్టులలో కూడా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజలు, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
న్యాయ సేవాధికార సంస్థలు న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయని, లోక్ అదాలత్ లు ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.












