మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల పనితీరు, సిబ్బంది హాజరును సమీక్షించి, రికార్డుల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్తో కలిసి పలు శాఖల దస్త్రాలను పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యమైన దస్త్రాలను క్రమబద్ధీకరించి నిర్వహించాలని ఆదేశించారు.
పూర్తయిన ఫైళ్లను వెంటనే రికార్డు రూంలో భద్రపరచాలని, కార్యాలయాల్లో ఎలాంటి ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రావతి, కలెక్టరేట్ ఏవోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తనిఖీ నేపథ్యంలో కలెక్టరేట్ వర్గాల్లో పనితీరులో చురుకుదనం కనిపించింది.











